
కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత ప్రేమలో పడ్డారన్న వార్తలు సౌత్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ సిద్ధాంత్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు కలిసున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

మృణాల్ క్లారిటీ..పెళ్లి వార్తలపై మృణాల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మృణాల్ దృష్టాంతా కెరీర్ మీదే ఉందని, ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని వెల్లడించింది. హిందీలో మూడు సినిమాలు చేస్తున్న మృణాల్, తెలుగు డెకాయిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి, మార్చిలో వరుసగా మృణాల్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇంట్రస్టింగ్ విషయం :యుఫోరియా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకుడు గుణశేఖర్ ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. లీడ్ క్యారెక్టర్‌లో నటించేందుకు సారా అర్జున్ అంగీకరిస్తేనే ఈ సినిమా చేద్దామని, లేదంటే ప్రాజెక్ట్ పక్కన పెట్టేదమని ముందే డిసైడ్ అయ్యామన్నారు. ఈ సినిమాతో 20 మంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు.

వసూళ్ల పరంగా దూసుకుపోతున్న అనగనగా ఒక రాజు :సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అనగనగా ఒకరాజు వసూళ్లు పరంగా దూసుకుపోతోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేయటం పక్కా అంటున్నారు విశ్లేషకులు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదీరి జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించారు.

ప్రదీప్ రంగనాథన్ : కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్‌లో ఓ సోషియో ఫాంటసీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ప్రదీప్ హీరోగా నటించిన లవ్ ఇన్‌స్యూరెన్స్ కంపెనీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.