
విజయ్ దేవరకొండ వికీపీడియాను జాగ్రత్తగా గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది.

ఇకపై ఈ కన్ఫ్యూజన్స్ వద్దు.. ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అంటున్నారు రౌడీ బాయ్. 2 సినిమాలు ఫైనల్ అయినా.. నిదానమే ప్రధానం అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది.

2025లో ఆయన ప్లానింగ్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడేం చేస్తున్నారు.? జయాపజయాలు నన్నేం చేస్తాయి.. నేను ఎండ్‌లో వచ్చే సక్సెస్‌ని కాదు.. దానికోసం కృషి చేసే ప్రయాణాన్ని ఇష్టపడతాను అని అంటారు విజయ్ దేవరకొండ.

అందుకే సక్సెస్ వస్తే పొంగిపోవడం, ఫెయిల్యూర్ వస్తే కుంగిపోవడం ఆయన డైరీలో లేదు. రిజల్ట్ ఎలా ఉన్నా.. అనుకున్న పనిమీద ఫోకస్ మాత్రం మానరు రౌడీ హీరో.

లాస్ట్ ఇయర్ ఖుషితో సూపర్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ, 2024లో ది ఫ్యామిలీ స్టార్‌తో పలకరించారు. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆడటంలో కాసింత తడబడినా పట్టించుకోలేదు రౌడీ స్టార్.

ఇందులో పోలీస్‌గా నటిస్తున్నారు విజయ్. ఈ సినిమా పూర్తయ్యాకే రవికిరణ్ కోలా, రాహుల్ సంక్రీత్యన్ సినిమాలు సెట్స్‌పైకి రానున్నాయి. వీటిలో రవికిరణ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. రాహుల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ టేకప్ చేస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ విజయ్‌లో గట్టి మార్పునే తీసుకొచ్చింది.

ఈ ఏడాది చివరిదాకా ఈ మూవీ పనులతోనే సరిపోతుంది ఆయనకు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత వీడీ14 సెట్స్ లో యాక్టివ్ కానున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది వీడీ14.

ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారీయన.