తంతే బూరలబుట్టెలో పడటం అంటే ఇదేనేమో..? ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందని తెలిసిన తర్వాత.. అయ్యయ్యో విజయ్ దేవరకొండకు మంచి డేట్ మిస్ అయిందే.. పండక్కి వచ్చుంటే ఫ్యామిలీస్ తెగ చూసేవాళ్లు అనుకున్నారు.
కానీ చూస్తుంటే.. 2024లోనే బెస్ట్ రిలీజ్ డేట్ రౌడీ బాయ్ సొంతమయ్యేలా కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా డేట్..? సంక్రాంతికి రావాల్సిన సినిమా.. సడన్‌గా వాయిదా పడిపోయింది.
మళ్లీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ఊసే ఎత్తట్లేదేంటి అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
పైగా గీతా గోవిందం కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. సంక్రాంతికి విడుదల చేయాలని షూటింగ్ వేగంగానే పూర్తి చేసారు దర్శకుడు పరశురామ్.
పోస్ట్ పోన్ అయ్యాక.. స్పీడ్ తగ్గించారు. మార్చ్‌లో ఫ్యామిలీ స్టార్ రావచ్చని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ తాజాగా లెక్కలన్నీ మారిపోయాయి. దేవర వాయిదా పడనున్న నేపథ్యంలో.. ఆ డేట్‌ను విజయ్ దేవరకొండ తీసుకుంటున్నారు.
ఎప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రానుంది. 2024లోనే బెస్ట్ రిలీజ్ డేట్స్‌లో ఎప్రిల్ 5 కూడా ఒకటి. 5, 6, 7 తేదీలు వీకెండ్ అయితే.. ఎప్రిల్ 9న ఉగాది.. 11న ఈద్ హాలీడే రానుంది..
ఇక ఎప్రిల్ 14న సండే, 17న శ్రీ రామనవమి ఉన్నాయి. ఈ లెక్కన రెండు వారాల్లో వీకెండ్ సహా.. 3 పబ్లిక్ హాలీడేస్ ఉన్నాయి. అందుకే ఫ్యామిలీ స్టార్ ఆ డేట్‌కు వస్తే విజయ్ దేవరకొండకు పండగే. చూడాలిక.. ఏం జరగనుందో.?