Rishab Shetty: సెకను కూడా ఆలోచించకుండా ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రిషబ్‌..

|

Dec 07, 2024 | 2:18 PM

కాంతార రిలీజ్‌ కావడానికి ముందు రిషబ్‌శెట్టి అంటే కన్నడిగులకు తప్ప, మిగిలిన వారికి పెద్దగా తెలియదు. అలాంటిది ఇప్పుడు రిషబ్‌ శెట్టి అంటే తెలియని మూవీ లవర్‌ ఉండరు. సరైన హిట్‌ ఒక్కటి పడితే చాలు... ప్రపంచానికి మనం పరిచయం కావడానికి అని ప్రూవ్‌ చేసింది కాంతార. ఆ మూవీతోనే జనాలకు దగ్గరవుతున్నారు రిషబ్‌. ఆయన మాటలు కూడా అంతే ఇంట్రస్టింగ్‌గా ఉంటున్నాయి.

1 / 5
ది ప్రైడ్‌ ఆఫ్‌ భారత్‌ - ఛత్రపతి శివాజీ మహారాజ్‌ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు రిషబ్‌శెట్టి. ఇంతటి గౌరవం దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కథ తన దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఓకే చేసినట్టు చెప్పారు కాంతార స్టార్‌. 

2 / 5
ఛత్రపతి శివాజీకి తాను వీరాభిమానినన్నారు రిషబ్‌. ఇండియన్‌ స్క్రీన్‌ మీద ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. అయితే వాటన్నిటిలోకీ శివాజీ బయోపిక్‌ అత్యంత గ్రాండ్‌గా ఉంటుంది అని అన్నారు.

3 / 5
ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్ పీరియన్స్ కోసమే కాదు... శివాజీ గురించి జనాలకు తెలియని కథలను చెప్పడానికి కూడా రెడీ అవుతున్నా అంటున్నారు హీరో రిషబ్‌ శెట్టి.

4 / 5
 కాంతారాతో వచ్చిన క్రేజ్‌ను పర్ఫెక్టుగా వాడుకుంటున్నారు రిషబ్. ఎలాంటి సినిమాలు చేస్తే అన్ని భాషల ఆడియన్స్‌కు రీచ్ అవుతాం అని పర్ఫెక్ట్ గా ప్లాన్‌ చేసుకుని సినిమాలు సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మతో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర చేస్తున్నారు.

5 / 5
 ఈ రెండు సినిమాలతో పాటు కాంతారా ప్రీక్వెల్‎గా తెరకెక్కుతున్న కాంతారా చాప్టర్ 1 సినిమాకు దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నారు రిషబ్ శెట్టి. ఇప్పటి విడుదలై ఈ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. 