
సలార్ సడన్ అనౌన్స్ మెంట్ వల్ల ఇబ్బందిపడుతున్న సినిమాలు, బేఫికర్‌గా ఉన్న సినిమాల మీద చర్చ జోరుగా సాగుతుంటే, కొందరికి మాత్రం ప్రభాస్, కృతి గురించి క్యూరియాసిటీ పెరుగుతోంది. ఆల్రెడీ ఈ ఇద్దరూ ఆదిపురుష్ తో స్క్రీన్స్ మీద సందడి చేశారు. నెక్స్ట్ సినిమాల రిలీజుల గురించి కూడా అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.

ఆదిపురుష్ సినిమా సమయంలో ప్రభాస్, కృతిసనన్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందంటూ విపరీతంగా వార్తలు వైరల్ అయ్యాయి. మా మధ్య ఫ్రెండ్‌షిప్ తప్ప మరేం లేదు..ఆ విషయాన్ని జానకి కూడా చెప్పారు కదా అంటూ డార్లింగ్ కూడా ఓపెన్ అయ్యారు. అయినప్పటికీ ఏమాత్రం అవకాశం వచ్చినా వారిద్దరి మీద ఓ కన్నేసి ఉంచుతున్నారు అభిమానులు.

ఆదిపురుష్ తర్వాత ప్రభాస్, కృతిసనన్ పర్సనల్‌గా కలుసుకున్నట్టు ఎక్కడా వార్తలు లేవు. అయితే ఆదిపురుష్‌తో కలిసి స్క్రీన్ మీదకు వచ్చిన వీరిద్దరూ, ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ అనౌన్స్ మెంట్స్ తో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేశారు.

టైగర్ ష్రాఫ్‌తో కలిసి కృతిసనన్ నటించిన గణ్‌పత్ సినిమా మీద నార్త్ లో మంచి హోప్స్ ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది గణ్‌పత్ సినిమా. ఇందులో టైగర్‌తో కలిసి కృతి కూడా యాక్షన్ సీక్వెన్స్ చేశారన్నది నార్త్ లో వైరల్ న్యూస్.

డిసెంబర్‌లో డార్లింగ్ వస్తుంటే, అక్టోబర్‌లో సందడి చేయడానికి సిద్ధమైపోయారు కృతి. వీరిద్దరూ ప్రమోషన్లలో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటారా? లేదా? ఇప్పుడు ఇదో ఇంట్రస్టింగ్ న్యూస్.