
బలగం సినిమాతో డైరక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వేణు. బలగం తర్వాత నాని హీరోగా వేణు ఓ సినిమా చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కేన్సిల్ అయింది అనేది టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట.

ఉన్నపళాన ఎందుకు కేన్సిల్ అయింది? అని ఆరా తీస్తే, 'ఆల్రెడీ దసరా డైరక్టర్‌తో నాని చేయబోయే సినిమా కాన్సెప్ట్ కూడా ఇలాగే ఉంటుందట. అందుకే ఈ ప్రాజెక్ట్ ని వద్దనుకున్నారు...' అనే విషయం రివీల్ అయింది.

నాని - వేణు మూవీ మాత్రమే కాదు, అల్లు అర్జున్ - అట్లీ సినిమా కూడా ఇప్పట్లో లేనట్టే అనే వార్తలు ఊపందుకుంటున్నాయి. అట్లీ చెప్పిన కథ బన్నీకి ఎగ్జయిటింగ్‌గా అనిపించలేదనే టాక్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నారు బన్నీ.

ఆ మధ్య తారక్ - త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు. కానీ, కథ కుదరకపోవడంతో అది ముందుకు సాగలేదు. అయితే ఇది ఎందుకు ఆగిపోయింది అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.

రీసెంట్ టైమ్స్ లో షెల్వ్ అయింది రవితేజ - గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన క్రెడిట్ ఉంది ఈ కాంబోకి. కాకపోతే మొన్నీమధ్య అనుకున్న సబ్జెక్టుకి బడ్జెట్ భారీగా అవుతుండటంతో స్టార్ట్ కాకముందే చెక్ పెట్టేశారు మేకర్స్.