
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త హీరోయిన్ల జోరు కొనసాగుతుంది. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ సరసన మరో కొత్త బ్యూటీ భాగ్య శ్రీ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా హీరోయిన్ భాగ్య శ్రీకి తెలుగులో మరో క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ మూవీ విడుదలకు ముందే ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త ప్రాజెక్టులో ఈ బ్యూటీని ఎంపిక చేశారట.

విజయ్ దేవరకొండ హీరోగా, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా VD12 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ స్పై థ్రిల్లర్‌లో మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఆమె ఇన్ స్టా స్టోరీలో శ్రీలంకలోని కొలంబోలో షూటింగ్ పిక్‌ను షేర్ చేసింది. దీంతో VD12లో భాగ్యశ్రీ కథానాయికగా నటిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఎప్పటినుంచో ఈసినిమాపై చాలా రూమర్స్ వినిపిస్తుండగా.. ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

గతంలో లైగర్ బ్యూటీ విషయంలో జరిగిందే, ఇప్పుడు భాగ్యశ్రీ విషయంలోనూ రిపీట్ అవుతోందా? అని అనుకుంటున్నారు జనాలు.. పూరి జగన్నాథ్ పరిచయం చేసే హీరోయిన్ అంటే, మినిమమ్ స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడటం ఖాయం అనే టాక్ వినిపించింది లైగర్ సమయంలో.