
నెవర్ బిఫోర్ అన్నట్టుంది సంక్రాంతి సీజన్‌ని టార్గెట్ చేస్తున్న సినిమాల కౌంట్ చూస్తుంటే. ఇంతకు ముందు రిలీజ్ డేట్లను ఒక్కసారి చెబితే ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు మళ్లీ మళ్లీ కన్‌ఫర్మ్ చేయమని మొరపెట్టుకుంటున్నారు. రవితేజ ఇప్పుడు తన మాస్ ఫ్యాన్స్ కి మరోసారి భరోసా ఇచ్చేశారు... సంక్రాంతికి రావడం పక్కా అని.

టైగర్ నాగేశ్వరరావు సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు రవితేజ. కచ్చితంగా జనాలకు నచ్చి తీరుతుందని అనుకున్నారు. కానీ విడుదలైనప్పటి నుంచే డివైడ్ టాక్‌తో నడిచింది టైగర్ నాగేశ్వరరావు. ఆ సినిమా రిజల్ట్ ని పక్కనపెట్టి ఇప్పుడు ఈగిల్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు మాస్ మహరాజ్.

జనాలకు కట్టుకథ, ప్రభుత్వాలు కప్పెట్టిన కథ. ద మేన్ ఈజ్ ఎవ్రీ వేర్ అంటూ ప్రతి షాటుతోనూ, ప్రతి డైలాగ్‌తోనూ రవితేజ కేరక్టర్‌కి హైప్ ఇచ్చారు ఈగిల్ టీజర్‌లో. విత్‌నెస్ ది స్టార్మ్ ఆన్ థర్టీన్త్ జనవరి అంటూ రిలీజ్ డేట్‌ని ఇంకో సారి కన్‌ఫర్మ్ చేశారు మేకర్స్.

అనుపమ పరమేశ్వరన్‌తో మొదలుపెట్టి, సినిమాలో నటించిన వారందరికీ టీజర్‌లో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. స్టార్టింగ్ టు ఎండింగ్ మాస్ మహరాజ్ కేరక్టర్‌కి వేరే రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. ఇదే టెంపో సినిమాలో ఉంటే పండక్కి హిట్ కొట్టడం పక్కా అనే మాట వినిపిస్తోంది.

2023 సంక్రాంతికి అన్నయ్య మెగాస్టార్‌తో కలిసి థియేటర్లలో హిట్ టేస్ట్ చేశారు రవితేజ. మరి 2024లో మోస్ట్ ఎక్స్ పెక్టెడ్ మూవీస్ మధ్య ఆయన ఈగిల్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందోననే క్యూరియాసిటీ జనాల్లో బాగా కనిపిస్తోంది.