- Telugu News Photo Gallery Cinema photos Shah Rukh Khan is give shock to Prabhas fans Photos Telugu Heroes Photos
Shah Rukh Khan – Prabhas: ప్రభాస్ vs షారూక్.! డార్లింగ్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన షారుక్ ఖాన్.
ప్రభాస్ అభిమానులకు షారూక్ ఖాన్ షాక్ ఇచ్చారు. షారూక్ మాటలు విన్న డార్లింగ్ ఫ్యాన్స్ మావోడి సలార్ మళ్లీ వాయిదా పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇంతకీ షారూక్ ఏమన్నారు, నిజంగానే మరోసారి సలార్ వాయిదా పడుతుందా. చూసేద్దాం రండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ నటించిన లెటెస్ట్ మూవీ డంకి. ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Updated on: Nov 08, 2023 | 6:26 PM

ప్రభాస్ అభిమానులకు షారూక్ ఖాన్ షాక్ ఇచ్చారు. షారూక్ మాటలు విన్న డార్లింగ్ ఫ్యాన్స్ మావోడి సలార్ మళ్లీ వాయిదా పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇంతకీ షారూక్ ఏమన్నారు, నిజంగానే మరోసారి సలార్ వాయిదా పడుతుందా. చూసేద్దాం రండి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ నటించిన లెటెస్ట్ మూవీ డంకి. ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా రిలీజ్ డేట్స్ ప్రకటించారు.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న సలార్, డంకీ బాక్సాఫీసు వద్ద పోటీపడబోతున్నాయి. అయితే సలార్ మరోసారి వాయిదా పడుతుందనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు కారణం షారూక్ ఖాన్ మాటలేనని తెలుస్తోంది. సోషల్ మీడియాలో షారూక్ ఖాన్ వీడియో ఒకటి తెగ తిరుగుతోంది.

తమ సినిమా పెద్దదని, ఆ తేదీ తమకు బాగా కలిసొస్తుందని, సినిమాలను క్లాష్ కాకుండా నివారించడం సాధ్యం కాదంటూ అందులో కామెంట్ చేశారు షారుఖ్. అయితే ఆ మాటలు విన్న డార్లింగ్ ఫ్యాన్స్... షారుఖ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే, సలార్ మరోసారి వాయిదా పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే షారుఖ్ మాట్లాడిన ఆ వీడియో 2016లోనిదట. బాజీరావు మస్తానీ, దిల్‌వాలే చిత్రాల విడుదల సందర్భంగా షారుఖ్ చేసిన కామెంట్స్ ని ఇప్పులు సలార్, డంకీకి ముడిపెట్టి వైరల్ చేస్తున్నారు.

దీంతో పలువురు సలార్ చిత్రం గురించే షారుఖ్ మాట్లాడినట్టు భావించారు. సలార్‌పై లేనిపోని అనుమానాలు అక్కడే మొదలయ్యాయి. ఇవన్నీ గమనిస్తున్న మేకర్స్ మాత్రం డైనోసార్ అనుకున్న తేదీకే వస్తుందని, నిశ్చింతగా ఉండవచ్చని అంటున్నారు.




