
రష్మిక మందన్న కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది.

సోషల్ మీడియాలో రష్మిక మందన్నకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు నాలుగు కోట్ల మంది ఈ ముద్దుగుమ్మను ఫాలో అవుతున్నారు.

ఇక ఈ బ్యూటీ ఒక్క ఫోటో షేర్ చేస్తే 10 లక్షలకు పైగా లైక్‌లు వస్తుంటాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తున్నారు. దీని కోసం ఆమె పెద్ద మొత్తంలో ఛార్జ్ చేస్తుంది.

రష్మిక మందన్న ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటుంది. దీనికి తోడు అనేక బ్రాండ్లు కూడా ప్రచారం చేస్తూ ఉంటుంది.

రష్మిక మందన్న సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.