
కెరీర్ విషయంలో ఫుల్ హ్యాపీ అంటున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తన అప్ కమింగ్ సినిమాల లైనప్ చూసి పొంగిపోతున్నారు.

ఇంతకన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోవడానికి ఇంకేం కావాలంటున్నారు శ్రీవల్లి. ప్రజెంట్ నేను గోల్డెన్ ఫేస్‌లో ఉన్నా... ఐయామ్ ఫుల్ హ్యాపీ అంటున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న.

సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో ఇంట్రస్టింగ్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ పాన్ ఇండియా రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నారు. అప్‌కమింగ్ మూవీ యానిమల్ ప్రమోషన్ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రష్మిక.

పాన్ ఇండియా సినిమా చేయడానికి ముందే నేషనల్ క్రష్‌గా పాపులర్ అయిన రష్మిక, పుష్ప సినిమాతో నార్త్ ఆడియన్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేశారు. అదే జోరులో వరుసగా బాలీవుడ్ సినిమాలతో సందడి చేశారు.

అయితే ఆ సినిమాలేవి అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోయినా... రష్మిక రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ బ్యూటీని వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రజెంట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో నటిస్తున్న ఈ బ్యూటీ..

ప్యారలల్‌గా యానిమల్ ప్రమోషన్‌లోనూ బిజీగా ఉన్నారు. ఈ రెండూ సినిమాలు నేషనల్ లెవల్‌లో తన ఇమేజ్‌ను డబుల్ చేస్తాయన్న నమ్మకంతో ఉన్నారు రష్మిక. సౌత్‌లో రెయిన్‌బో అనే బైలింగ్యువల్ మూవీ చేస్తున్న రష్మిక, నార్త్‌లో విక్కీ కౌషల్‌కు జోడిగా ఓ మూవీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇలా ఏ మాత్రం బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు రష్మిక.