Rashmika Mandanna: రష్మిక లక్ మాములుగా లేదుగా.. షారుఖ్ సరసన నేషనల్ క్రష్…
దక్షిణాది హీరోయిన్ రష్మిక మందన్నా.. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ వరుస అవకాశాలు క్యూకడుతున్నాయి. ఇప్పుడు ఈ నేషనల్ క్రష్ పుష్ప2, యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు అడియన్ ముందుకు రానున్నాయి.