Rajeev Rayala | Edited By: Ravi Kiran
Nov 12, 2021 | 7:01 AM
టాలీవుడ్ హీరోహీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశి ఖన్నా
ప్రస్తుతం రాశి ఖన్నా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
రాశి ఖన్నా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కనిపిస్తోంది.
‘నాకు కాబోయేవాడు పెద్దగా అందంగా లేకపోయినా పర్వాలేదు. కానీ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అంటుంది రాశి
నా లాగే దేవుడిపై నమ్మకంతో పాటు భక్తిభావం ఉండాలి. అలాంటి లక్షణాలు ఉన్నావాడు నాకు భర్త రావాలని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
రాశి ఖన్నా చేతిలో అరడజన్‌కు పైగా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళంలో ‘అరణ్‌మణై 3’, విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసుకుంది.
తెలుగులో నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్ పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తోంది.
హిందీలో షాహిద్ కపూర్ ‘సన్నీ’వర్కింగ్ టైటిల్, అజయ్ దేవగణ్‌తో ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ చేస్తుంది.