Rajeev Rayala |
Oct 06, 2022 | 9:22 PM
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన భామల్లో రమ్యకృష్ణ ఒకరు. రమ్యకృష్ణ సెకెండ్ ఇన్నింగ్స్ లో సంగతి తెలిసిందే. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్ర లు దక్కించుకుంటూ అక్కడా తనదైన మార్క్ అప్పిరియన్స్ తో అదరగొడుతున్నారు.
ఇటీవలే పూరిజగన్నాథ్ దర్శకత్వం లో విజయ్ దేవకొండ హీరోగా నటించిన లైగర్ లో `సాలా క్రాస్ బ్రీడ్` అంటూ తనదైన మాస్ అప్పిరియన్స్ తో ఆకట్టుకున్నారు రమ్యకృష్ణ.
అంతకు ముందు కింగ్ నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో నాగార్జున భార్యగా నటించి అలరించారు రమ్యకృష్ణ. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ.
ప్రస్తుతం తన భర్త క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `రంగమార్తాండ ` సినిమాలోనూ కీలక పాత్ర పోసిస్తున్నారు. ఇంకా కొన్ని చిత్రాలు సెట్స్ లో ఉన్నాయి.
`నా అల్లుడు` సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ల తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో `సయ్యా సయ్యారే` అనే పాటకు రమ్య స్టెప్పులేసారు.
తాజాగా సాంగ్ గురించి చెప్తూ.. ఆ సాంగ్ చేసేటప్పుడు తాను నాలుగు నెలల ప్రెగ్నెంట్ అన్న విషయాన్నిరమ్యకృష్ణ రివీల్ చేసారు. అందుకే ఈ పాట నాకు చాలా స్పెషల్` అని చెప్పుకొచ్చారు