
కార్తిక్, శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతోంది. శంకర్ కోసం తమన్ స్పెషల్ కేర్ తీసుకుని చేశారనే మాట గట్టిగా వినిపిస్తోంది.

రంగస్థలంలో చిట్టిబాబును చూశాం కదా... కాస్త చెవి వినపడకుండా, లుంగీతో, అదో రకమైన రంగుల చొక్కాలతో పక్కా పల్లెటూరి హీరోలా శభాష్ అనిపించుకున్నారు కదా... ఇప్పుడు అంతకు మించి.. అంటే చిట్టిబాబు 2.0 వెర్షన్‌ని చూపించడానికి రెడీ అవుతోంది ఆర్సీ 16 యూనిట్.

ఆల్రెడీ మైసూర్‌లో ఆర్సీ16 పనులు స్టార్ట్ అయ్యాయి. నైట్ షూట్‌లు జరుగుతున్నాయి. రామ్‌చరణ్, జాన్వీ కపూర్ తో పాటు, కీలక పాత్రధారులు షూట్‌కి హాజరవుతున్నారు.

తమిళనాట మాత్రం నిన్న మొన్నటి వరకు గట్టి పోటి తప్పదన్న టాక్ వినిపించింది. నెమ్మది గా అక్కడ కూడా గేమ్ చేంజర్‌కి గ్రౌండ్ క్లియర్ అవుతోంది. విక్రమ్ - వీర ధీర సూరన్, బాలా - వనంగాన్, అజిత్ - విడాముయర్చి సినిమాలు జనవరి 10న రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నాయి.

బీస్ట్ మోడ్ ఆన్ అంటూ ఆ మధ్య ఫొటో పంచుకున్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక ఆలిమ్ హకీమ్ పర్యవేక్షణలో మేకోవర్ అవుతున్నారు చెర్రీ. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అయితే, పూర్తిగా ఆర్సీ 16 మీదే ఫోకస్ పెట్టేస్తారు రామ్‌చరణ్.