
సినిమా అప్‌డేట్ వచ్చినప్పుడో.. రిలీజ్ టైమ్ దగ్గరపడినప్పుడో ఏ స్టార్ అయినా ట్రెండింగ్‌లోకి రావడం మామూలే. అయితే అలాంటిదేమీ లేకుండా జస్ట్ డే టు డే లైఫ్‌లో కనిపించే ఇన్సిడెంట్స్ తో టాప్‌లో ట్రెండ్ అవుతున్నారు గ్లోబల్ స్టార్. వరుసగా మూడు రోజులుగా ఆయన్ని ట్రెండ్‌లో ఉంచుతున్న విశేషాలేంటి? నెక్స్ట్ మూవీస్ అప్‌డేట్స్ ఏంటి? చూసేద్దాం...

సిల్వర్ స్క్రీన్ మీద నాటు నాటు అంటూ తారక్ అండ్ చెర్రీ కలిసి వేసిన స్టెప్పులు చూశారు కదా... ఈ పాట విడుదలైనప్పటి నుంచీ ఎవరికి తోచినట్టు వారు రీల్స్ చేస్తూనే ఉన్నారు. అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ ఖాన్ త్రయం ఈ పాటకు కాలు కదిపారు. అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో వాళ్లతో పాటు చెర్రీ వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. నాచో నాచో అంటూ నిర్మాణ సంస్థ కూడా ఈ క్లిప్‌ను ఇష్టంగా షేర్ చేసింది.

ఈ పెళ్లి వేడుకకు స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్‌లో జర్నీ చేశారు చెర్రీ దంపతులు. అయితే విమానాశ్రయంలో తారక్, చెర్రీ కలిసి కనిపించడం ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ట్రిపుల్ పోస్ట్ ప్రమోషన్లు, ఆస్కార్ వేడుకల తర్వాత వీరిద్దరూ కలిసి కనువిందు చేయడం అరుదైపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కలిసి కనిపించేసరికి, ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.

జర్నీలో ఉపాసన రెస్ట్ తీసుకుంటూ ఉంటే, ఆమె పాదాలు పడుతూ ఉన్న చెర్రీ విజువల్స్ కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. ఇలాంటి భర్తే కావాలని ఫిక్సయిపోతున్నారు అమ్మాయిలు. బయట ఎంత పెద్ద స్టార్ అయినా, ఫ్యామిలీతో చెర్రీ అప్రోచ్ కేక అంటూ కితాబిచ్చేస్తున్నారు.

ఇన్ని విషయాలు ట్రెండింగ్‌లో ఉండగానే ఆర్సీ 16 మ్యూజిక్ సిట్టింగ్స్ వేగంగా జరుగుతున్నాయనే విషయం కూడా వైరల్ అవుతోంది. బుచ్చిబాబు సానా డైరక్షన్‌లో చెర్రీ నటిస్తున్న సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సాంగ్స్ కంపోజింగ్ జరుగుతోంది. ఈ విషయం తెలిసి మేం హ్యాపీ అంటోంది మెగా సైన్యం. పనిలో పనిగా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ గురించి కూడా ఓ మాట చెప్పేయ్ గురూ అని రిక్వెస్టులు కూడా పెడుతున్నారు ఫ్యాన్స్