
వాణిశ్రీ హయాంలో ఉన్న హీరోయిన్లు, శ్రీదేవి టైమ్ నాయికలు అంటూ... ఆ సమయంలో స్క్రీన్ మీద కనిపించిన వారిని జట్టుగా చెబుతుంటాం. అలా 20 ఇయర్స్ బ్యాక్ నయన్, త్రిష పేర్లు వినిపించాయి. రీసెంట్ టైమ్స్ లో పూజా, రష్మిక మధ్య కంపేరిజన్ ఉండేది. వీరికన్నా ముందు బాగా వినిపించిన పేర్లు రాశీ అండ్ రకుల్.

ఒకప్పుడు దక్షిణాదిన ఫేమ్ చూసిన ఈ భామలు ఇప్పుడు ఎందుకు కనుమరుగవుతున్నారు.? రకుల్ పేరు లేకుండా ఇప్పుడు నార్త్ లో గ్లామర్ న్యూస్ లేనే లేదు. ఈ నెల 21న పెళ్లిపీటలు ఎక్కనున్న ఈ అమ్మడి లవ్‌స్టోరీ గురించే ఇప్పుడు సర్వత్రా వార్తలు వినిపిస్తున్నాయి.

జాకీని రకుల్ ఎక్కడ కలిశారు? వారి లవ్‌స్టోరీ ఎలా షురూ అయింది? అంటూ రకరకాల కథనాలు కనిపిస్తున్నాయి. ఇండియన్ 2 మినహా రకుల్ చేతిలో సౌత్ ప్రాజెక్టులు ఏవీ కనిపించడం లేదు.

పెళ్లి తర్వాత కూడా నటించాలనుకుంటున్న ఈ బ్యూటీ, నార్త్ ప్రాజెక్టుల మీదే ఫోకస్ చేస్తున్నారు. రాశీఖన్నా కూడా ఉత్తరాది మేకర్స్ తోనే కంఫర్ట్ గా ఫీలవుతున్నట్టున్నారు.

ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి యోధలో నటిస్తున్నారు రాశీ ఖన్నా. లాస్ట్ ఇయర్ ఫర్జిలో చేశారు. ఫర్‌దర్‌గా కూడా నార్త్ ప్రాజెక్టులతోనే బిజీ అవ్వాలన్నది రాశీ కోరిక.

సౌత్‌లో తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళంలోనూ మంచి పేరే ఉంది రాశీ ఖన్నాకు. అయినా ఈ మధ్య ఆమను సౌత్ మేకర్స్ పలకరించడం లేదా? లేకుంటే నార్త్ కమిట్‌మెంట్స్ తోనే బిజీగా ఉన్నారా? అన్నదాని మీద కూడా క్లారిటీ లేదు.

ఏదేమైనా అటు రకుల్, ఇటు రాశీ... ఇద్దరూ టాలీవుడ్‌కి క్రమ క్రమంగా దూరమవుతున్నారన్నది అందరి దృష్టిలోనూ ఉన్న న్యూస్.