
మూడేళ్ళ కిందే రిటైర్మెంట్ అన్నారు.. సినిమాలు చేసినా మహా అయితే ఇంకో రెండు మూడే అన్నారు.. చేయాలనుకున్నా ఆరోగ్యం సహకరించాలిగా అనుకున్నారు. కానీ అనుకుంటే కానిదేంటని నిరూపిస్తూ రప్ఫాడిస్తున్నారు రజినీకాంత్. వరస సినిమాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు సూపర్ స్టార్. తాజాగా మరోటి ఫైనల్ అయింది. ఉన్నట్లుండి రజినీ జోరెందుకు పెంచినట్లు..?

రజినీకాంత్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరీ ముఖ్యంగా జైలర్ సక్సెస్ తర్వాత రజినీ జోరు మరింత పెరిగింది. దీనికి ముందు వరస ఫ్లాపులు ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టాయి.

జైలర్‌కు వర్కవుట్ అయిన ఆ ఫార్ములానే నెక్ట్స్ సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు సూపర్ స్టార్. మరి రజినీకాంత్ తీసుకుంటున్న ఆ జాగ్రత్తలేంటి..? జైలర్ సక్సెస్ తర్వాత రజినీకాంత్‌లో జోష్ పదింతలు పెరిగిపోయింది.

దర్శకుల కంటే.. కథ కంటే.. ఆ ఒక్క విషయంలో మాత్రం రజినీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమున్నా లేకపోయినా.. తన సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అని దర్శకులకు చెప్తున్నారు.

తన మార్కెట్ తగ్గిందేమో.. ఒకప్పట్లా తన సినిమాలు ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు సూపర్ స్టార్‌లోనూ జైలర్‌కు ముందు వచ్చుంటాయి.. కానీ ఒక్క హిట్‌తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది.