5 / 5
తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్ ఎంట్రీ ఇప్పుడు సంచలనంగా మారింది. దళపతి ఎంట్రీ ఇవ్వగానే, విశాల్ కూడా వచ్చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే, తాను ప్రజా సేవ చేయడానికి రాజకీయాలు అక్కర్లేదని విశాల్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. దీని గురించి విశాల్ తండ్రి జీకే రెడ్డి స్పందించారు. విజయ్‌లాగా విశాల్ కూడా బాగా సంపాదించుకుని, పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాక రాజకీయాల్లోకి వస్తే బావుంటుందని అన్నారు. ఇప్పటికే విశాల్ ఎంతో మందిని చదివిస్తున్నాడు. ప్రతి నెలా 30 నుంచి 40 లక్షల రూపాయలదాకా ఖర్చవుతోంది. ఈ ఖర్చులు భరించడానికి కొన్నిసార్లు అప్పులు చేస్తున్నాడని అన్నారు జీకే రెడ్డి. ఇలాంటి ఈతిబాధల నుంచి బయటపడాలంటే, ముందు సినిమాల్లో బాగా సంపాదించాలని సూచించారు.