
ఎప్పటికప్పుడు తన స్పీడ్‌తో అందరికీ షాకులు ఇస్తూనే ఉన్నారు రజినీకాంత్. అనారోగ్యం కారణంగా ఈయన సినిమాలు మానేస్తారు.. ఇదే చివరి సినిమా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

కానీ రజినీ మాత్రం అవేం పట్టించుకోకుండా తన పని తాను చేస్తుంటారు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు పూర్తి చేస్తున్నారీయన. జైలర్ తర్వాత లాల్ సలామ్, వేట్టయాన్ సినిమాలను ఏడాది గ్యాప్‌లోనే పూర్తి చేసారు రజినీకాంత్.

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్‌తో కూలీ సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. దీని షూటింగ్ కూడా పూర్తైపోయింది. తక్కువ వర్కింగ్ డేస్‌లోనే కూలీ పూర్తి చేసారు లోకేష్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. కూలీ సెట్స్‌పై ఉన్నపుడే జైలర్ 2 మొదలుపెట్టారు రజినీకాంత్.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. నెల్సన్ స్పీడ్ చూస్తుంటే మరో ఆర్నెళ్లలోనే ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం జైలర్ 2 టీమ్ కేరళ అట్ఠపాడిలో ఉన్నారు.. అక్కడే సినిమా కోసం భారీ సెట్లను నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 10 నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్ అక్కడే ప్లాన్ చేస్తున్నారు నెల్సన్. జైలర్ 2లో రజినీ పాత్రను కేవలం 20 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు నెల్సన్. ఎండలు మండిపోతున్నా.. రజినీ మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. ఈ సినిమాలో రజినీ పోర్షన్ జులైలోపే పూర్తయ్యేలా కనిపిస్తుంది. జైలర్‌లో ఉన్న పాత్రలతో పాటు ఈసారి మరికొన్ని కొత్తగా యాడ్ కానున్నాయి.. బాలకృష్ణ క్యామియోపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది.