
దర్శకుల కంటే.. కథ కంటే.. ఆ ఒక్క విషయంలో మాత్రం రజినీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమున్నా లేకపోయినా.. తన సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అని దర్శకులకు చెప్తున్నారు.

జైలర్‌కు వర్కవుట్ అయిన ఆ ఫార్ములానే నెక్ట్స్ సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు సూపర్ స్టార్. మరి రజినీకాంత్ తీసుకుంటున్న ఆ జాగ్రత్తలేంటి..? జైలర్ సక్సెస్ తర్వాత రజినీకాంత్‌లో జోష్ పదింతలు పెరిగిపోయింది.

తన మార్కెట్ తగ్గిందేమో.. ఒకప్పట్లా తన సినిమాలు ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు సూపర్ స్టార్‌లోనూ జైలర్‌కు ముందు వచ్చుంటాయి.. కానీ ఒక్క హిట్‌తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది.

ఏం ప్రాబ్లమ్ లేదు.. మనల్ని ఇంకా ఆడియన్స్ కావాలయ్యా అంటున్నారని రజినీకి కూడా క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్‌తో పాటు లోకేష్ కనకరాజ్ సినిమాలు చేస్తున్నారు రజినీ.

ఈ రెండు సినిమాల కాస్టింగ్ బలంగా ఉంది. జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. వెట్టైయాన్‌లోనూ రానా, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి.. రజినీ భారాన్ని దించేసింది జైలర్. మొన్నామధ్య లాల్ సలామ్ ఫ్లాపైనా.. అది రజినీ సినిమా కాదు. అందుకే ఆశలన్నీ వేట్టయన్‌పైనే ఉన్నాయి.

తాజాగా ఉపేంద్ర లుక్ కూడా విడుదల చేసారు. కన్నడ సూపర్ స్టార్ ఇందులో కలీసా పాత్రలో నటించబోతున్నారు. మొత్తానికి జైలర్ తర్వాత.. తన సినిమాలను స్టార్స్‌తో నింపేస్తున్నారు రజినీ.