Film Updates: రజనీకాంత్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్.. అవి పట్టించుకోవద్దన్న జాన్వీ..

|

Jul 27, 2024 | 4:19 PM

వేట్టయాన్‌ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదని అన్నారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. కెరీర్‌ ఆరంభంలో తాను ఎదుర్కొన్న అవమానాలపై బాలీవుడ్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌ మాట్లాడారు. ఆమీర్‌ఖాన్‌తో వైవాహిక జీవితానికి స్వస్తి పలకడంపై స్పందించారు ఆయన మాజీ సతీమణి కిరణ్‌రావు.  వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు నటి జాన్వీ కపూర్‌.  అజిత్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా విడాముయర్చి. 

1 / 5
వేట్టయాన్‌ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదని అన్నారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ప్రస్తుతం ఆ సినిమా డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయని తెలిపారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తాను నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందని చెప్పారు రజనీకాంత్‌. 

2 / 5
కెరీర్‌ ఆరంభంలో తాను ఎదుర్కొన్న అవమానాలపై బాలీవుడ్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌ మాట్లాడారు. సూటిపోటి మాటల వల్ల కుంగుబాటుకు గురయ్యానని తెలిపారు. ఆడిషన్స్ కి వెళ్లినప్పుడు ఎవరూ విలువ ఇచ్చేవారు కాదని అన్నారు. అలాంటప్పుడు వారు ఏం అన్నా... పడగలగాలని చెప్పారు. బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవని అన్నారు.

3 / 5
ఆమీర్‌ఖాన్‌తో వైవాహిక జీవితానికి స్వస్తి పలకడంపై స్పందించారు ఆయన మాజీ సతీమణి కిరణ్‌రావు. తానిప్పుడు ఆనందంగా ఉన్నానని అన్నారు. విడాకుల తర్వాత కుంగిపోలేదని చెప్పారు. ఇరు కుటుంబాలు తనకు అండగా నిలిచాయని తెలిపారు. 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని అనుకున్నప్పుడు కాస్త ఇబ్బందిపడ్డమాట వాస్తవమని చెప్పారు.

4 / 5
అజిత్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా విడాముయర్చి. మగిళ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

5 / 5
సోషల్‌ మీడియా వేదికగా వచ్చే విమర్శలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు నటి జాన్వీ కపూర్‌. సోషల్‌ మీడియా కల్చరే అలాంటిదని చెప్పారు. పబ్లిక్ పిగర్‌ కాకపోయినా, ఆ వేదిక మీద ఇంతకన్నా మారుగా జరగదని తెలిపారు. ఓ సందర్భంలో పొగిడిన వారే, మరో సందర్భంలో దుమ్మెత్తిపోస్తారని చెప్పారు. వాటిని పట్టించుకోకూడదని అన్నారు.