SSMB 29: అప్‌డేట్ అడిగితే కొడతానంటున్న జక్కన్న

| Edited By: Phani CH

Sep 14, 2024 | 11:55 AM

కావాలంటే ఓ ఏడాది ఎక్కువ టైమ్ తీసుకుందాం కానీ క్వాలిటీ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు రాజమౌళి. మామూలుగానే ఈయన తన సినిమాల కోసం చాలా టైమ్ తీసుకుంటారు. ఇక SSMB29 కోసం ఆ టైమ్ ఇంకాస్త పెరిగేలా కనిపిస్తుంది. మరి మహేష్, జక్కన్న సినిమా సెట్స్‌పైకి వచ్చేదెప్పుడు..? 2024లో దీనికి మోక్షం ఉందా లేదా..?

1 / 5
బాహుబలి సిరీస్‌తో 2400 కోట్లు.. ట్రిపుల్ ఆర్‌తో 1300 కోట్లు వసూలు చేసి చూపించిన రాజమౌళి.. మహేష్ బాబు కోసం అంతకుమించే ఆలోచిస్తారు కానీ తగ్గరు కదా..! ఇప్పుడిదే జరగబోతుంది. SSMB29 కోసం చాలా వరకు టీం అంతా హాలీవుడ్ నుంచే రానున్నారు.

2 / 5
రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన సూపర్ స్టార్‌, ఆ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. ట్రిపులార్ రిలీజ్ తరువాత ఎక్కువ రోజులు ఆ సినిమా ప్రమోషన్స్ మీదే గడిపిన జక్కన్న కూడా ఇప్పుడు పూర్తిగా మహేష్ మూవీ మీదే వర్క్ చేస్తున్నారు.

3 / 5
ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ప్రజెంట్‌ లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి.

4 / 5
అన్నీ బానే ఉన్నా షూటింగ్ అప్‌డేట్ ఏంటంటే మాత్రం నో అప్‌డేట్ అంటున్నారు రాజమౌళి. దీనిపై ఓ క్లారిటీ వచ్చేలా ఉందిప్పుడు. జనవరి 2025 నుంచి SSMB29 సెట్స్‌పైకి రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత మహేష్ సినిమా సెట్స్‌పైకి రానుందని తెలుస్తుంది.

5 / 5
 ప్రీ ప్రొడక్షన్‌తో పాటు వర్క్ షాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు జక్కన్న. ఇవన్నీ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నాకే.. సెట్స్ పైకి వెళ్లాలని చూస్తున్నారు మేకర్స్. హీరోయిన్, మిగిలిన క్యాస్టింగ్ విషయంలోనూ త్వరలోనే రాజమౌళి ఓ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది.