
ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ స్టార్ట్ అయిన టైమ్‌లో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరిగింది. యూనిట్ కన్ఫార్మ్ చేయకపోయినా... ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్‌లో అదే ట్రెండ్ కనిపిస్తుండటం ఇది వైరల్ అవుతుంది.

సీక్వెల్ ట్రెండ్‌ను మొదలు పెట్టింది జక్కన్నే కావటంతో ఎస్ఎస్ఎంబీ 29 రెండు భాగాలుగా రావటం పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. ఇప్పుడు జక్కన్న మనసు మార్చుకున్నారు. మహేష్ మూవీని కాస్త లెంగ్తీగా అయినా ఒకే పార్ట్‌లో ముగించేయాలని ఫిక్స్ అయ్యారు.

దాదాపు మూడున్నర గంటల నిడివితో మహేష్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు మూవీ మేకర్స్. అయితే ఈ నిర్ణయానికి కారణం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇది హాట్ టాపిక్ అయింది.

అనవసరంగా కథను లాగటం కన్నా... షార్ట్ అండ్ క్రిస్ప్‌గా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలన్నది రాజమౌళి ప్లాన్ అన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో రెండు సినిమాలకు మహేష్ డేట్స్ ఇవ్వటం కష్టమన్న ఉద్దేశంతోనే జక్కన్న ప్లాన్ మార్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఈ రెండింట్లో ఏది నిజమైనా... ఎస్ఎస్ఎంబీ 29 ఒకే పార్ట్‌గా రావటం మాత్రం ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయ్యింది. అయితే ఇటీవల మహేష్ షూట్ నుంచి బ్రేక్ తీసుకొని కుటంబంతో ఫారెన్ టూర్ వెళ్లారు. అయినప్పటికీ మూవీ షూటింగ్ యధావిధిగా జారుతుంది.