పుష్ప 2 ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌పై సోషల్ మీడియాలో స్పందించారు దర్శక ధీరుడు రాజమౌళి. 'పాట్నాలో మొదలైన వైల్డ్ ఫైర్, దేశమంతా వ్యాపిస్తోంది. పుష్ప పార్టీ కోసం వెయిటింగ్' అంటూ ట్వీట్ చేశారు జక్కన్న. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె నెక్ట్స్ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రివీల్ చేశారు మేకర్స్. రక్కయీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతున్నారు నయన్. సెంథిల్ దర్శకత్వం వహిస్తున్నారు.
మల్టీ లింగ్యువల్ స్టార్ అర్జున్ సర్జను ఎంజీర్ యూనివర్సిటి గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సినీ రంగంతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలకు కూడా ఈ డాక్టరేట్‌ను అందిస్తున్నట్టుగా వెల్లడించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో అర్జున్ డాక్టరేట్ అందుకున్నారు.
భాగీ సిరీస్‌లో ఫోర్త్ ఇన్‌స్టాల్మెంట్‌ను ఎనౌన్స్ చేశారు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్. సాజిద్ నదియావాల నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ హర్ష దర్శకుడు. ఇప్పటి వరకు భాగీ సిరీస్‌లో భాగంగా సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ వచ్చారు టైగర్. ఇప్పుడు ఫోర్త్ మూవీని ఏ సౌత్ మూవీకి రీమేక్‌గా ప్లాన్ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోసారి ఎమర్జెన్సీ రిలీజ్‌కు డేట్ లాక్ చేశారు కంగనా రనౌత్. 2025 జనవరి 17న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా వెళ్లడించారు. కంగనా రనౌత్ స్వయంగా నటించి నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా ఎమర్జెన్సీ. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విషయంలో సిక్కు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయటంతో సెన్సార్ సర్టిఫికేట్ జారీ ఆలస్యమైంది.