3 / 5
ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. కానీ, ఆడిషన్స్ ఇచ్చేవారి ప్రయత్నాలు మాత్రం ఎక్కడో ఓ చోట ఆగితే బావుంటుందనిపిస్తుంది. ఈ స్టేట్‌మెంట్‌ని నెగటివ్ సెన్స్ లో తీసుకునేరు... ఇక్కడ అంతా పాజిటివేనండోయ్. ఆడిషన్స్ ట్రయల్స్ ఆగడమంటే మంచి అవకాశం రావడం అని అర్థం. రమన్ రాఘవ్ 2.0 సినిమాకు సెలక్ట్ కావడం వల్ల, తాను మరో వెయ్యి ఆడిషన్స్ ఇవ్వకుండా ఆగానని అంటున్నారు శోభిత దూళిపాళ. ఆ ప్రాజెక్ట్ తన మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించిందని అన్నారు. తనకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్‌లు లేరని చెప్పారు. తాను క్లాసికల్ డ్యాన్సర్ కావడం వల్ల, హావభావాల మీద నమ్మకంతో ఆడిషన్స్ కి వెళ్లినట్టు తెలిపారు.