
సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ పూరీ. కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్‌జివి శిష్యుడు అయిన పూరీ జగన్నాథ్..

పూరీ జగన్నాథ్ 20 ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్స్ గా తెరకెక్కిన బద్రి సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టారు.

తరవాత అనేక ఫ్లాపులు పూరీ జగన్నాథ్ పనైపోయిందన్న టైమ్‌లో తిరుగులేని హిట్‌తో మళ్లీ సత్తా చాటడం దర్శకుడిగా పూరీ జగన్నాథ్.

తెలుగు ఇండస్ట్రీలో పడిలేచిన కెరటం దర్శకుడు పూరీ జగన్నాథ్. ఎన్నిసార్లు పడినా కూడా లేవడం ఈయన శైలి.

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది.

ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి ఈ మూవీ విడుదల కానుంది.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన బర్త్‌డేను లైగర్ సెట్లో జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

గోవాలో ప్రముఖుల మధ్య పూరి జగన్నాధ్ బర్త్ డే సెలెబ్రేషన్స్

హాజరైన ఛార్మీ కౌర్, విజయ్ దేవరకొండ, లైగర్ టెక్నీషియన్స్