
మన దగ్గర ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్‌లో ఎవరున్నారు? ఫలానావారు టాప్ హీరో అని స్పెషల్‌గా చెప్పలేమా? తమిళనాడులో విజయ్, అజిత్ సినిమాలు చేయడం మానేస్తారా? అదే జరిగితే కోలీవుడ్ సినిమా సీన్ ఎలా ఉండబోతోంది? ఈ వారం హాట్ హాట్‌గా జరుగుతున్న డిస్కషన్ ఇది.

పెద్ద హీరోలు ఎవరన్నది జస్ట్ కలెక్షన్ల ఆధారంగా నిర్ణయించలేమన్నది ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న మాట. ప్రభాస్‌ని కూడా దేశంలో పెద్ద హీరో అని చెప్పలేం... బాహుబలికి కల్కికి మధ్య ఆయన చేసిన సినిమాలు కొన్ని అంచనాలను అందుకోలేదని అంటారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు.

పవన్‌కల్యాణ్‌కి తెలుగు రాష్ట్రాల్లో సూపర్‌డూపర్ క్రేజ్ ఉన్నా, చిన్న డైరక్టర్లతో చేసినా పెద్ద ఓపెనింగ్స్ తెచ్చుకోగల స్టామినా ఉన్నా... జానీ లాంటి ఫ్లాప్‌లు ఆయన కెరీర్‌లోనూ ఉన్నాయన్నది సురేష్‌బాబు చెప్పిన మాట. మంచి కంటెంట్‌తో 100 కోట్లు తెచ్చుకున్న హీరోలు మన దగ్గర చాలా మందే ఉన్నారన్నది ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఒపీనియన్.

తమిళనాడులో రజనీకాంత్, అజిత్, విజయ్ మధ్య ఎంత పోటీ ఉన్నా, టాప్ హీరో ఎవరనేది చెప్పలేం. ఒకవేళ విజయ్ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలను వదిలేసినా ఇక్కడ పరిస్థితుల్లో పెద్ద మార్పు ఉండదన్న సురేష్‌బాబు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అజిత్‌లాంటివారు సినిమాల నుంచి తప్పుకున్నా పెద్దగా నష్టం ఉండదు. స్టార్లు తప్పకుంటే మిగిలిన వారు ఆ ప్లేస్‌కి వచ్చేస్తారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు చనిపోయినప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీ ఏమైపోతుందా అని అందరూ భావించారని, ఎవరికోసం ఏదీ ఆగదని చెప్పారు సురేష్‌బాబు.