
నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందం ప్రియాంక మోహన్. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆతర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు మరోసారి తెలుగులో సినిమా చేస్తోంది.

అయితే తాజాగా ప్రియాంక నాని సినిమా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఆమె కాస్త బొద్దుగా కనిపించారు.

దీని పై క్లారిటీ ఇస్తూ శివకార్తికేయన్ తో రెండు సినిమాలు చేశాను.. ఆయన స్వీట్స్ ఎక్కువగా తింటారు. పక్కన ఉన్నవాళ్లకు కూడా బలవంతంగా తినిపిస్తుంటారు. అందుకే లావు అయ్యాను అనేలా ఆమె సమాధానం చెప్పారు.