
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. మిర్చీ లాంటి కుర్రాడు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఈ మూవీ హిట్ అవ్వకపోవడం, ఈ బ్యూటికి ఊహించిన రేంజ్‌లో ఫేమ్ సంపాదించుకోలేకపోయింది.

కానీ తర్వాత ప్రగ్యా, వరుణ్ తేజ హీరోగా నటించిన కంచె సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో వచ్చిన ప్రతి ఆఫర్ అందుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కంచె సినిమా తర్వాత, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చాలా సినిమాల్లో నటించింది.

ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ, నందమూరి బాలకృష్ణ సరసన అఖండ మూవీలో నటించింది. ఈ మూవీతో మొదటి సారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు గ్లామర్‌కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ చిన్నది.

అంతే కాకుండా తర్వాత కూడా మరోసారి బాలయ్యతో జోడి కట్టి డాకు మహారాజ్‌తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఈ అమ్మడు రెండు సినిమాలతో వరసగా హిట్స్ అందుకున్నప్పటికీ, ఆశించిన రేంజ్‌లో అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన గ్లామర్‌తో మతి పొగొడుతుంది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.