Prabhas: 2025 డార్లింగ్ యాక్షన్ ప్లాన్ వచ్చేసిందిగా.. ఇక దబిడి దిబిడే

| Edited By: Phani CH

Dec 31, 2024 | 1:36 PM

ప్రభాస్ సినిమాకి సంబంధించిన ఒక్క అప్‌డేట్ వస్తేనే అభిమానులను ఆపడం కష్టం. అలాంటిది ఒకేసారి మూడు నాలుగు అప్‌డేట్స్ వస్తే ఇంకేమైనా ఉందా..? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇదే. 2025లో ప్రభాస్ యాక్షన్ ప్లాన్ అంతా వచ్చేసింది. అది చూసాక ఫ్యాన్స్ గాల్లో తేలిపోవడం ఖాయం. మరి ఆ ప్లాన్ ఏంటో చూద్దామా..?

1 / 5
తన ప్లానింగ్‌తో మిగిలిన హీరోలకు నిద్ర లేకుండా చేస్తున్నారు ప్రభాస్. ఆర్నెళ్లకో సినిమా ఎలా పూర్తి చేయాలో నన్ను చూసి నేర్చుకోండి అంటున్నారు. ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ 90 శాతం పూర్తైంది. సిజీ వర్క్ మాత్రమే బ్యాలెన్స్.

2 / 5
ఇది కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు మారుతి. మరోవైపు నాన్ స్టాప్‌గా ఫౌజీ షూట్ జరుగుతూనే ఉంది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ షూటింగ్ 40 శాతం పూర్తైంది.

3 / 5

ఎప్రిల్‌లోపే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తుంది. దీనికి కేవలం 90 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు ప్రభాస్. దీని తర్వాత స్పిరిట్ స్క్రిప్ట్‌తో ప్రభాస్ కోసం వేచి చూస్తున్నారు సందీప్ రెడ్డి వంగా.

4 / 5
మే నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. స్పిరిట్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. మేలో మొదలు పెట్టి డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలనేది సందీప్ వంగా ప్లాన్.

5 / 5
ఇందులో కొరియన్ స్టార్ డాంగ్ లీ కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి 2025లోనూ ఆర్నెళ్లకో సినిమా ప్లాన్ చేస్తున్నారు రెబల్ స్టార్.