
డార్లింగ్ ఫ్యాన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సలార్ సినిమా రిలీజ్ రోజు ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షోస్ వేసేందుకు అనుమతించింది. చిత్ర యూనిట్ అభ్యర్దన మేరకు సింగిల్ స్క్రీన్స్‌లో 65 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయల వరకు టికెట్ రేట్ పెంచుకునేందుకు కూడా అనుమతించింది ప్రభుత్వం.

మంగళవారం రిలీజ్ అయిన హనుమాన్ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఈ సినిమా, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ ఈ మూవీ రూపొందించారు. ఒకేసారి పదికి పైగా భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సందీప్ మాధవ్ హీరోగా శివ ప్రసాద్ బూర్లె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా మహతి. పద్మిని సినిమాస్ బ్యానర్‌లో మూడో ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మంగళవారం ప్రారంభమైంది. ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బిగ్‌బాస్ ఫినాలే తరువాత జరిగిన గొడవ విషయంలో సోహెల్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అభిమానులు కార్ల అద్దాలు పగలగొట్టడం మంచిది కాదన్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్లంతా ఫ్రెండ్లీగా ఉంటారన్న సోహెల్, వాళ్ల కోసం అభిమానులు గొడవలు చేయటం మంచిది కాదన్నారు.

యానిమల్ సినిమా సక్సెస్‌లో భారీ గన్ సీన్ కూడా కీ రోల్ ప్లే చేసింది. తాజాగా ఆ గన్ మేకింగ్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్. 5 నెలల పాటు కష్టపడి 500 కిలోల ఒరిజినల్ స్టీల్‌తో ఆ గన్ తయారు చేసినట్టుగా వెల్లడించారు. గన్ ఎలా ఉండాలి అన్న ఐడియా మాత్రం పూర్తిగా సందీపే ఇచ్చారన్నారు సురేష్.