
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నెగెటివ్ రోల్‌లో కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

దానికి రీజన్.. డాన్ లీ. సలార్ 2 పోస్టర్‌ని డాన్‌లీ అలా పంచుకున్నారో లేదో.. ఇలా డార్లింగ్ సినిమాలో ఇంటర్నేషనల్ స్టార్ అనే మాట వైరల్ అయింది.

వారు బద్ధ శత్రువులుగా మారిన స్టోరీతో సెకండ్ పార్ట్ శౌర్యాంగపర్వం సిద్ధమవుతోంది. డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా కొబ్బరికాయ కొట్టేశారు మేకర్స్. సలార్2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.

మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. దీంతో పాటే హను రాఘవపూడి సినిమా సెట్స్‌పై ఉంది. 2025 సమ్మర్ నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. మరోవైపు అదే సమ్మర్ కానుకగా ఎప్రిల్ 10 రాజా సాబ్ విడుదల కానుంది.

రీసెంట్ టైమ్స్‌లో డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న డార్లింగ్, పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. అందుకే స్పిరిట్ సినిమా మీద ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు డార్లింగ్. స్పిరిట్ సినిమా కాస్టింగ్ విషయంలో సందీప్ ప్లానింగ్ మామూలుగా లేదు.

ఇటు కల్కి సీక్వెల్ న్యూ ఇయర్‌లో స్టార్ట్ అయ్యే సూచనలు బాగానే కనిపిస్తున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల షూటింగులు చేయాలంటే, డార్లింగ్ ఎన్ని షిఫ్టులు పనిచేయాలి? అని లెక్కలేసుకుంటున్నారు అభిమానులు.

ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలుండగా.. దర్శకులంతా ప్రభాస్ మాత్రమే కావాలని ఎందుకు కోరుకుంటున్నారు..? ఆయన కోసం ఏళ్ళకేళ్లు ఎందుకు వేచి చూస్తున్నారు..?