
రాజా సాబ్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. ఓ వైపు కల్కి సినిమా రిలీజ్ డేట్‌పై కన్ఫ్యూజన్ సాగుతున్న సమయంలోనే.. మారుతి సినిమా గురించి మతిపోయే అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత విశ్వప్రసాద్. అది విన్నాక ప్రభాస్ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు. మరి వాళ్లకు అంతగా కిక్ ఇస్తున్న ఆ అప్‌డేట్ ఏంటి..? అసలు రాజా సాబ్ విడుదల ఎప్పుడు..?

ప్రభాస్‌ను ఇలా రొమాంటిక్‌గా చూసి చాలా రోజులైపోయింది. అందుకే ఆ బాధ్యత మారుతి తీసుకున్నారు. ఎప్పుడూ మాస్ సినిమాలేంటి డార్లింగ్.. నేను ఓ మాంచి ఎంటర్‌టైనర్ తీస్తా నీతో అంటూ రాజా సాబ్ చేస్తున్నారు ఈ దర్శకుడు. అయితే మిగిలిన సినిమాలపై వచ్చిన అప్‌డేట్స్.. రాజా సాబ్‌పై మాత్రం రావట్లేదు. కానీ తాజాగా రాజా సాబ్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నామని బాంబు పేల్చారు నిర్మాత విశ్వప్రసాద్.

ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే లాంటి సినిమాలతో బిజీగా ఉన్నపుడు.. మారుతి సినిమాకు సైన్ చేసారు ప్రభాస్. వాటి నుంచి ఖాళీ దొరికినపుడే రాజా సాబ్‌కు డేట్స్ ఇస్తున్నారు రెబల్ స్టార్. ఒక్కముక్కలో చెప్పాలంటే.. వరసగా భారీ సినిమాలు చేసి అలిసిపోతున్న ప్రభాస్.. మారుతి సినిమాను రిలాక్సేషన్ కోసం చేస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో రిస్క్ లేని సినిమాగా రాజా సాబ్ రెడీ అవుతుంది.

తాజాగా ఈగల్ ప్రమోషన్స్‌లో విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసి.. వచ్చే సంక్రాంతికి రాజా సాబ్‌ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఆల్రెడీ చాలా సినిమాలున్నాయి కదా అంటే.. ప్రభాస్ వస్తే సపరేట్‌గా స్లాట్ ఉండాల్సిందే అంటూ మాస్ రిప్లే ఇచ్చారు విశ్వప్రసాద్. మొత్తానికి ప్రభాస్ పొంగల్ రేసులో జాయిన్ అయితే.. చిరు, నాగ్, వెంకీకి పెద్ద పోటీ ఎదురైనట్లే.