
కల్కి కోసం ప్రభాస్ తన సొంత ప్లానింగ్స్ కూడా మార్చుకుంటున్నారా..? ముందు అనుకున్న ట్రిప్‌ను కూడా పక్కనబెట్టి మరీ షూటింగ్‌కు వచ్చేస్తున్నారా..? ఉన్నట్లుండి ప్రభాస్ ఇలా మనసు మార్చుకోవడం వెనక మతలబు ఏంటి..? ఎందుకు షెడ్యూల్స్‌లో ఈ సడన్ ఛేంజెస్ వస్తున్నాయి..? ప్రాజెక్ట్ కే అనుకున్న టైమ్‌కు వస్తుందా లేదంటే ఏదైనా మార్పులున్నాయా..?

ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినననేది మహేష్ బాబు డైలాగ్ కానీ ఇప్పుడు ప్రభాస్‌కు బాగా సూట్ అవుతుంది. పాపం ఇప్పటికే ఈయన సినిమాలు ఒక్కటి కూడా చెప్పిన టైమ్‌కు రావట్లేదని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకే దీనిపైనే ఇప్పుడు సీరియస్‌గా ఫోకస్ చేసారు రెబల్ స్టార్. మాటిస్తే.. తప్పేదే లే అన్నట్లు తన సినిమాల కోసం కష్టపడుతున్నారు.

నిజానికి ప్రభాస్ షెడ్యూల్ ఫిబ్రవరిలో వేరుగా ఉంది. ఈయన 40 రోజుల పాటు యూరప్ ట్రిప్ వెళ్లాల్సి ఉంది. సర్జరీ కోసం మరోసారి ఆయన ఫారెన్ వెళ్తున్నారంటూ నిన్నమొన్నటి వరకు కూడా ఇండస్ట్రీలో వార్తలు బాగానే వినిపించాయి. అయితే కల్కిని అనుకున్న తేదీకి తెచ్చేందుకు.. తన షెడ్యూల్‌లో మార్పులు చేసుకున్నారు ప్రభాస్.

కల్కి భారీ సినిమా.. అందులో ప్రభాస్ ఒక్కడే కాదు.. కమల్ హాసన్, దీపిక పదుకొనే, అమితాబ్ లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్నారు. వాళ్లందరి డేట్స్ కూడా ఒకేసారి దొరకడం కష్టం. అందుకే ఫిబ్రవరి 16 నుంచి అందరి కాంబోలో వచ్చే సీన్స్ ప్లాన్ చేస్తున్నారు నాగ్ అశ్విన్. మే 9న ఎట్టి పరిస్థితుల్లోనూ కల్కి 2898 AD విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. అందుకే దీనికి తగ్గట్లుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు డార్లింగ్.

మార్చ్‌లోపే కల్కి సినిమా పూర్తి చేయాలనేది ప్రభాస్ ప్లాన్. ఆ తర్వాతే యూరప్ ట్రిప్ అయినా.. ఇంకే ట్రిప్ అయినా అనేది మెంటల్‌గా ఫిక్సైపోయారు. అంతేకాదు.. కల్కి ప్రమోషన్ కోసం నెల రోజులకే పైగానే డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారు ప్రభాస్. కల్కి విడుదల తర్వాత మారుతి రాజా సాబ్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నారు ప్రభాస్. ఇప్పటికైతే ప్రాజెక్ట్ కే కారణంగా ప్రభాస్ ప్లాన్స్ అన్నీ మారిపోతున్నాయి.