Pawan Kalyan: అన్నీ ఎన్నికల తర్వాతే..! షూటింగ్స్ బ్రేక్ వేసిన పవన్ కళ్యాణ్..
కొత్తగా ఏమైంది.. అనుకున్నదేగా అయింది.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమాలు కమిటైన దర్శక నిర్మాతలు మనసులో అనుకుంటున్న మాట ఇదే అయ్యుండొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటికీ పరిష్కారం చూపించారు PK. మరి ఆయన తీసుకున్న నిర్ణయమేంటి..? ఎలక్షన్స్ కారణంగా పవన్ సినిమాలు ఆగిపోతున్నాయా..? ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే.. కోరి కోరి కొరివితో తల గోక్కోవడమే అవుతుంది.