Pooja Hegde: బుట్టబొమ్మకు ఎంత కష్టమొచ్చిందో..! అసలు పూజా కమ్ బ్యాక్ ఎప్పుడు..

| Edited By: Prudvi Battula

Dec 09, 2023 | 10:32 AM

ఎలాంటి హీరోయిన్‌కు ఎంత కష్టమొచ్చిందిరా బాబూ..! ఇప్పుడు పూజా హెగ్డేను చూసి ఇదే అంటున్నారు ఆమె కల్ట్ ఫ్యాన్స్. అయినా ఇండస్ట్రీలో ఆఫర్స్ రావాలన్నా.. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్నా టైమ్ రావాలి. ఒకప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే.. ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. అసలు పూజా కమ్ బ్యాక్ ఎప్పుడు..?

1 / 5

2 / 5
మన పిచ్చి గానీ లైఫ్ అంటే పాటలో చెప్పినట్లు ఎందుకుంటుంది చెప్పండి..? ఎంత పెద్ద హీరోయిన్‌ కెరీర్ అయినా పడుతూ లేస్తూనే ఉంటుంది. దానికి పూజా హెగ్డే కూడా మినహాయింపేమీ కాదు. టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీకి బ్యాడ్ టైమ్ నడుస్తుందిప్పుడు. ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశాల్లేక.. ఖాళీ టైమ్‌ను ఫోటోషూట్స్‌ కోసం, ఫ్యామిలీ కోసం వాడేస్తున్నారు.

3 / 5
నిన్నమొన్నటి వరకు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ అంటూ అంతా స్టార్స్‌తో జోడీ కట్టారు పూజా. వాళ్ల నుంచి అవకాశాలు మొండికేయడంతో నెక్ట్స్ లిస్టులో ఉన్న రవితేజ, నితిన్, సాయి తేజ్ లాంటి హీరోల నుంచి పిలుపు వస్తుందని ఆశగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది గాంజా శంకర్‌లో ఈమెకు ఛాన్స్ వచ్చింది. కానీ షూటింగ్‌ మొదలవ్వడానికి ఇంకా టైమ్ పడుతుంది.

4 / 5
ఈ లోపు బాలీవుడ్‌ను వదలట్లేదు పూజా హెగ్డే. అక్కడ షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న కోయి షక్‌తో పాటు రణ్‌వీర్ సింగ్ కొత్త సినిమాలోనూ నటిస్తున్నారు. గతంలో సర్కస్‌‌లో ఈ ఇద్దరూ నటించారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. అందుకే తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చినా హ్యాపీ.. రాకపోయినా ఓకే అన్నట్లున్నారు ఈ బ్యూటీ.

5 / 5
తెలుగులో ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్. ఇది హిట్టైతే పూజాకు మళ్లీ డిమాండ్ పెరిగే ఛాన్సులున్నాయి. దాంతో పాటు రవితేజ, హరీష్ శంకర్ సినిమాలోనూ పూజా పేరునే పరిశీలిస్తున్నారు. అయితే ఇవన్నీ అనుకున్నట్లు జరగాలంటే మాత్రం ముందు ఒక్కటైనా వచ్చి విజయం సాధించాలి. చూడాలిక.. ఏం జరగబోతుందో..?