
Tollywood: సిల్వర్ స్క్రీన్‌పై పొలిటికల్ హీట్.. ఖద్దరు డ్రెస్‌పై ఆసక్తి చూపిస్తోన్న స్టార్ హీరోలు, హీరోయిన్లు

గేమ్ చేంజర్ సినిమా కోసం ఫస్ట్ టైమ్ పొలిటీషియన్‌గా మారారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాదు ఈ సినిమాలో చెర్రీ ముఖ్యమంత్రిగా కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో చెర్రీ క్యారెక్టర్లో ఏ రియల్ పొలిటిషన్ రిఫరెన్స్‌లు కనిపిస్తాయన్న డిస్కషన్ టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా జరుగుతోంది.

ఇండియన్ 2 వర్క్‌లో బిజీగా ఉన్న కమల్ హాసన్ కూడా ఓ సీరియస్ పొలిటికల్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ 2లోనూ పొలిటికల్ యాంగిల్ టచ్ చేస్తున్న కమల్, హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మేజర్‌గా పొలిటికల్ సీన్సే చూపించబోతున్నారు.

తాజాగా యాత్ర 2 టీజర్ రిలీజ్ కావటంతో ఈ సినిమాలో నటించబోయే హీరో గురించి కూడా డిస్కషన్ జరుగుతోంది. యాత్ర సినిమా కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని తీసుకొచ్చిన దర్శకుడు మహి వీ రాఘవ, యాత్ర 2 కోసం ఎవరిని తీసుకువస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ నటుడు జీవా జగన్ పాత్రలో నటిస్తారన్ టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.

బాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ పీరియాడిక్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేస్తున్నారు. ఎమర్జెన్సీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇందిర గాంధీ పాత్రలో నటిస్తున్నారు కంగనా.