
నేషనల్ వైడ్ మూవీ లవర్స్ ఏ ఇద్దరు కలిసినా ఒకటే మాట.. ఛావా చూశావా? థియేటర్లలోనే చూడాల్సిన సినిమా. వీలైనంత త్వరగా చూడండి. ఆ ఎమోషన్స్, ఆ ఎపిసోడ్స్... చరిత్రను కళ్లకు కడుతుంటే, ఇది కదా మన చరిత్ర అని మనసు ఉప్పొంగుతుంటే.. మాటల్లో చెప్పలేం.. చూసేయండీ అని! తనయుడు శంభాజీ కథకే జనాలు ఫిదా అవుతుంటే.. శివాజీ సినిమాను ఇలా తెరకెక్కిస్తే బాక్సాఫీస్ షేక్ కాకుండా ఉంటుందా చెప్పండి?

ఛావా కోసం ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు శిక్షణ తీసుకున్నా. ఆ శిక్షణ వల్ల నా జీవితంలో క్రమశిక్షణ అలవాటైంది అని విక్కీ కౌశల్ చెప్పినప్పుడు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా చేసినన్ని రోజులూ విక్కీ.. గాయాలను లెక్కపెట్టలేదు. లక్ష్యపెట్టలేదు. జస్ట్ మనసు పెట్టి మూవీ చేశారంతే!

ఛావా లాంటి సినిమా జనాల ముందుకు వస్తున్నప్పుడు నేను కాలి గాయం గురించి ఆలోచిస్తూ ఇంట్లో కూర్చుంటానా? ప్రజల్లోకి వెళ్లి మూవీ గురించి మాట్లాడి తీరుతానని రష్మిక వేసిన అడుగులకు ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. వారెవా.. ఏమి పెర్ఫార్మెన్స్ చేశారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఛావా సినిమాలో శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ చేసిన సాహసాలను, ఆయన శౌర్యాన్నీ చెప్పారు మేకర్స్. నమ్మిన ధర్మాన్ని, తనవారిని కాపాడుకోవడానికి ఆయన చేసిన పోరాటాల గురించి ప్రస్తావించారు.

ఇదే ఎమోషన్‌తో శివాజీ కథ రూపొందిస్తే.. బాక్సాఫీస్ బద్ధలు కాకుండా ఉంటుందా? యస్.. అలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్నామంటున్నారు మూవీ లవర్స్. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కనున్న ఛత్రపతి శివాజీ మహరాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాంతార మూవీ కంప్లీట్ కాగానే శివాజీ సబ్జెక్టును మొదలుపెడతారనే వార్తలూ వైరల్ అవుతున్నాయి.