OG: రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటున్న పవన్ కళ్యాణ్

Edited By: Phani CH

Updated on: Jun 05, 2025 | 6:34 PM

ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అనే డైలాగ్ గుర్తుంది కదా..? దీన్నే కాస్త మార్చి చెప్తున్నారు పవన్. ఒక్కోసారి డేట్స్ ఇవ్వడం లేట్ అవుతుందేమో గానీ ఇవ్వడం పక్కా.. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడం పక్కా అంటున్నారు పవర్ స్టార్. ఈ నేపథ్యంలోనే ఓజి గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చిందిప్పుడు. మరి అదేంటో తెలుసా..?

1 / 5
కొన్ని రోజులుగా పవన్ పూర్తిగా సినిమా హీరో అయిపోయారు.. OG షూటింగ్‌లో పాల్గొంటున్నారు.. సినిమాల కోసం పాలిటిక్స్‌‌కు చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చారు. 10 రోజులుగా ముంబైలోనే జరుగుతున్న ఓజి షెడ్యూల్ ఫినిష్ అయిపోయింది.

2 / 5
2 డేస్ గ్యాప్ తీసుకుని.. జూన్ 5 నుంచి విజయవాడలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు మేకర్స్. విజయవాడ షెడ్యూల్‌తో పవన్ పోర్షన్ అంతా పూర్తైపోయింది. జూన్‌లోనే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు సుజీత్.

3 / 5

జులై, ఆగస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ చేసి.. సెప్టెంబర్ 25న చెప్పినట్లుగానే సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు మాటల్లో చెప్పడం కూడా కష్టమే.. ఓజి ఫస్ట్ డే నుంచి ఇదే హైప్ మెయింటేన్ చేస్తుంది.

4 / 5
ముంబై బేస్డ్ మాఫియా యాక్షన్ డ్రామాగా వస్తుంది ఓజి. ఇందులో ఓజాస్ గంభీర అనే పాత్రలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని తెలుస్తుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపిస్తున్నారు.

5 / 5
ఓజితో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. జులైలో ఈ సినిమా సెట్‌కు రానున్నారు పవన్. ఇప్పటికే హరీష్ శంకర్ కూడా స్క్రిప్ట్ వర్క్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను రెండు నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్. అన్నీ కుదిర్తే రాబోయే 365 రోజుల్లో పవన్ నుంచి మూడు సినిమాలు రానున్నాయి.