
అయ్యో పాపం.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను చూడగానే ఇదే మాట అనాలనిపిస్తుంది. అదేంటి.. ఆయనకేమైంది.. శుబ్బరంగా ఉన్నారు.. హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు.. మరోవైపు రాజకీయంగానూ బిజీగానే ఉన్నారు కదా.. అయ్యో పాపం అనడం ఎందుకింక అనుకుంటున్నారు కదా..? అలా ఎందుకు అన్నామో.. అనాల్సి వస్తుందో ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది.

పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు బ్యాలెన్స్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నారు కానీ పాపం ఆయన ముందు మాత్రం అన్నీ సవాల్లే కనిపిస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆయన అనుకున్నది ఏదో రకంగా డిస్టర్బ్ అవుతుంది. షూటింగ్ చేద్దామని అనుకున్నా కూడా చేయలేని పరిస్థితి బిజీ షెడ్యూల్ పవన్ ముందుప్పుడు. దాంతో సినిమాలపై ఫోకస్ చేయలేకపోతున్నారు.

తెలంగాణలో మరో నెలన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి. వస్తే రానీ.. పవన్‌కు ఏంటి సంబంధం.. ఆయన ఏపీ కదా అనుకోడానికి లేదు. ఎందుకంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయబోతుంది. మరి అలాంటప్పుడు కచ్చితంగా ప్రచారం అయితే చేయాలి కదా..? చేయకుండా ఉండలేరు.. చేస్తే ఎప్పుడు అనేది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ ప్రచారం చేస్తే ఎప్పుడొస్తారు.. ఆ డేట్స్ మళ్లీ తన సినిమాలను డిస్టర్బ్ చేయకుండా ఎలా మ్యానేజ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. మరోవైపు కొన్నిరోజులుగా బ్రేక్‌లో ఉన్న హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొత్త షెడ్యూల్ అక్టోబర్ 20 నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నారు.. అలా చేసినా మరో అడ్డంకి పవన్ కోసం వెయిట్ చేస్తుంది.

ఉస్తాద్ షెడ్యూల్ అక్టోబర్ 20 నుంచి స్టార్ట్ చేసారే అనుకుందాం..! నవంబర్ 1న వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో జరగనుంది. దీనికోసం వారం బ్రేక్ తీసుకున్నారు మెగా హీరోలు. మరి పవన్ కూడా తీసుకుంటారా లేదంటే ఒకట్రెండు రోజుల ముందు ఇటలీకి వెళ్తారా అనేది ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి టైమ్ అయితే ఇవ్వాల్సిందే. మరి ఇన్ని సవాళ్లను ఒకేసారి పవన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.