
కల్కి పార్ట్ 2 కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారు నాగీ. ఈ లోపే కల్కి జపాన్ రిలీజ్‌కు రెడీ అయింది. డిసెంబర్ చివరి వారంలో కల్కి టీమ్ జపాన్ వెళ్లి.. ప్రమోషన్స్ చేస్తారని తెలుస్తుంది.

అయితే నియర్ ఫ్యూచర్‌లో ఈ ప్లానింగ్ మారబోతోందా? యస్ అనే అంటున్నాయి రెబల్ వర్గాలు. ఇప్పుడు రాజా సాబ్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఫౌజీ కూడా జరుగుతోంది.

మార్కెట్ రావడం గొప్ప కాదు.. వచ్చిన మార్కెట్‌ను నిలబెట్టుకోవడమే గొప్ప. ఇప్పుడదే చేస్తున్నారు ప్రభాస్. అది ఇండియాలో అయినా.. ఓవర్సీస్‌లో అయినా.. ఒకసారి తనకొచ్చిన మార్కెట్‌ను వదిలే సమస్యే లేదంటున్నారు రెబల్ స్టార్.

గతంలో ట్రిపుల్ ఆర్ కోసం జపాన్‌కు ప్రమోషనల్ టూర్ వెళ్లారు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి. అది సినిమాకు బాగా హెల్ప్ అయింది. మరిప్పుడు కల్కికి ఏం జరుగుతుందో చూడాలిక.

ఇప్పటిదాకా ఒక లెక్క. ఇంకపై ఇంకో లెక్క అంటున్నారట డార్లింగ్. 2024 దాకా ఏం జరిగిందన్నది హిస్టరీ. 2025 నుంచి ఏం చేయబోతున్నామన్నదే ప్లానింగ్ అంటూ నియర్ అండ్ డియర్స్ తో పక్కాగా చెప్పేస్తున్నారట.

ఈ సినిమాతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇమాన్వి. ఈమెకు ఇప్పుడు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయట.

అయినా ఫౌజీ పూర్తయ్యేవరకు మరే సినిమా కమిట్ కాకూడదని మూవీ యూనిట్ ముందే కండిషన్ పెట్టినట్టు సమాచారం. నాన్‌స్టాప్‌గా సినిమాలు చేయాలి ప్రభాస్.

ప్రాజెక్టుల్లో స్పీడ్ తగ్గకుండా ఉండాలంటే సెట్లో మిగిలిన ఆర్టిస్టుల కాల్షీట్లన్నీ డార్లింగ్‌కి అనుగుణంగా ఉండాలన్నది మేకర్స్ ప్లాన్. అందుకే ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్ల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నారట.

త్వరలో షూట్ స్టార్ట్ చేయనున్న స్పిరిట్ అండ్ అదర్ మేకర్స్ ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో లెట్స్ వెయిట్ అండ్ సీ.