
బేబీ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ తెచ్చిన బజ్ అంతా ఇంతా కాదు. కాలేజీల్లో యూత్ అంతా థియేటర్లలో వాలిపోయేంతగా మౌత్‌టాక్ స్ప్రెడ్ చేశాయి పెయిడ్ ప్రీమియర్స్. ఇంకో షో పెంచండి, ఇంకొన్ని థియేటర్లలో సినిమాను ప్రొజెక్ట్ చేయండి అంటూ రిక్వెస్టులు అందాయంటే, పెయిడ్ ప్రీమియర్స్ కి ఉన్న సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు

రీసెంట్‌గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌ని నిలబెట్టింది కూడా పెయిడ్ ప్రీమియర్సే. అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని, పల్లెటూళ్లల్లో కొన్ని వర్గాల మధ్య ఉంటే అవాంతరాలను అద్భుతంగా కళ్లకు కట్టారన్న వార్త అప్పటికప్పుడు వైరల్ అయింది.

ఆ మధ్య పాయల్ రాజ్‌పుత్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం మంగళవారం విషయంలోనూ పెయిడ్ ప్రీమియర్స్ ప్రొజెక్షన్ ప్లస్ అయింది. ముద్ర మీడియా వర్క్స్ మరియు ఎ క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం., మరియు అజయ్ భూపతి నిర్మించారు.

పెద్దగా సక్సెస్‌లు లేక సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణుకి సామజవరగమన సినిమా సక్సెస్ సరికొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నరేష్, శ్రీవిష్ణు తండ్రీ కొడుకులుగా చేసిన పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు జనాలు. పెయిడ్ ప్రీమియర్స్ సమయంలోనే పాజిటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయింది.

బలగం విషయంలోనూ అదే జరిగింది. ఆ మధ్య కొత్తవారితో ట్రై చేసిన మ్యాడ్, రైటర్ పద్మభూషణ్, ఘాజీ, మేజర్ సినిమాలకు కూడా పెయిడ్ ప్రీమియర్లు హెల్ప్ అయ్యాయి. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే, ధైర్యంగా పెయిడ్ ప్రీమియర్స్ తో పాజిటివ్ బజ్ తెచ్చుకోవచ్చని మేకర్స్ లో ఓ రకమైన భరోసా కనిపిస్తోందిప్పుడు.