
తెలుగు చిత్ర సీమలో ఎన్టీఆర్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

‘ఆర్‌ఆర్‌ఆర్’ మువీతో ఎన్టీఆర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్‌ఫాలోయింగ్

ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి

‘మీరు నాపై చూపించే ప్రేమకు రెట్టింపు ప్రేమ నాకూ మీపై ఉంది. నేను దాన్ని చూపించలేకపోతున్నా. మనది రక్తసంబంధం కంటే గొప్పబంధం. మీరందరూ నా సోదరులతో సమానం. మీ అభిమానానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా..ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానం కోసం పుట్టాలనుకుంటున్నా' అంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యాడు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30వ సినిమాలో దివంగత తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించనున్న విషయం తెలిసిందే.