
మామూలుగానే పవన్ సినిమా వచ్చేముందు ఓ వైబ్రేషన్ ఉంటుంది.. అది హిట్టా ఫట్టా పక్కనబెడితే ఓపెనింగ్స్‌లో పవన్ తోపు. మొన్న హరిహర వీరమల్లు సైతం ఫస్ట్ డే 80 కోట్లకు పైనే వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఓకే గానీ.. ఓవర్సీస్‌లో మిగిలిన హీరోలతో పోలిస్తే కాస్త వెనకబడ్డారు పవర్ స్టార్. ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తుండటంతో.. ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై కనిపించింది.

చాలా ఏళ్ళ తర్వాత పవన్ అసలు స్టామినాను ఓజి చూపిస్తుంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 6 రోజుల్లోనే 1 మిలియన్ వసూలు చేసింది ఓజి. విడుదలకు 20 రోజుల ముందే ఈ రికార్డ్ క్రియేట్ చేసారు పవన్.

ఈ దూకుడు కంటిన్యూ అయితే.. రిలీజ్ నాటికి కేవలం ప్రీమియర్స్‌తోనే OG 3 మిలియన్ వరకు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.పాజిటివ్ టాక్ గానీ వచ్చిందంటే.. ఓజి ఓవర్సీస్ అరాచకానికి హద్దే ఉండదు.

వీకెండ్‌లోపే 5 మిలియన్.. ఫుల్ రన్‌లో 10 మిలియన్ వసూలు చేసినా తక్కువే. చాలా ఏళ్ళ తర్వాత పవన్ చేస్తున్న గ్యాంగ్ స్టర్ డ్రామా కావడంతో దీనిపై ఇంటా బయటా ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది.