- Telugu News Photo gallery Cinema photos NTR Ram Charan and RRR Team In Oscar Awards proud moment Photos goes viral in social media Telugu oscar award Photos
Oscar 2023 Photos: ఆస్కార్ గెలచుకున్న నాటు పాట క్షణాలు.. గుండెల్లో భావోద్వేగం.. మనసంతా తెలుగు గర్వం.. ఫొటోస్.
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్ వేదికపై సత్తా చాటింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కించుకుంది.
Updated on: Mar 13, 2023 | 10:24 AM


బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తో ఆస్కార్ అవార్డు షేర్ చేసుకుంటూ దిగిన ఫోటో వైరల్ అవుతుంది.

95వ అకాడమీ అవార్డుల పండుగకు ప్రపంచ దిగ్గజ నటీనటులు హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు డెరెక్టర్ రాజమౌళి.

ఇక రెడ్ కార్పెట్ మీద గర్జించే పులి బొమ్మ ఉన్న సూట్‌తో ఎంట్రీ ఇచ్చారు తారక్. దీంతో టైగర్ పిక్చర్ గురించి ఆరా తీశారు నిర్వాహాకులు.

పులి.. భారత్ జాతీయ మృగం అని చెప్పారు ఎన్టీఆర్. రెడ్ కార్పెట్ పైకి ఇండియా నడిచి వస్తున్న సింబల్ గా చెప్పారు తారక్.

ఆ తరువాత బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ఇండియాకు ఆస్కార్ వచ్చింది.ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాత గునీత్ మోంగా తారక్ తో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియానే షేక్ చేస్తుంది.

స్టైలింగ్‌లోనూ... తన ట్రెండీ లుక్ తోనూ ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్గా మారే రామ్ చరణ్.

ఇప్పుడు ఆస్కార్ రెడ్ కార్పాట్ పై చెర్రీ లుక్ అండ్ తన టేస్ట్ ఆఫ్ స్టైల్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు.

సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ వేదిక ఎంట్రన్స్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు.

నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫామెన్స్‌కు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలను వేదికపైకి ఇన్వైట్ చేశారు దీపికా పదుకొనె.

అదే ఆస్కార్ వేదికపై జక్కన్న తన ఇద్దరి హీరోలు తారక్ - చెర్రీ లతో ఫోట్లకు ఫోజులిచ్చారు.

ఆస్కార్ వేదిక వద్ద కీరవాణి గారి భార్య శ్రీవల్లి కూడా తనదైన స్టయిల్లో సందడి చేసారు.

గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ వేదిక ఎంట్రన్స్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఇక నాటునాటుకు వెస్ట్రన్ డ్యాన్సర్స్‌తో కలిసి..అమెరికా నటి గాట్లీబ్ స్టెప్పులేశారు. నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫామెన్స్‌కు ఆస్కార్స్‌లో స్టాండింగ్ ఒవేషన్ లభించింది.

ఆ తర్వాత నాటు నాటు లైవ్ ఫెర్మార్మెన్స్‌తో అదరగొట్టారు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. ఇండియన్ ట్రెడిషనల్ వేర్ లాల్చీ పంచకట్టులో ప్రపంచ వేదికపై నాటు నాటు పాటను ఆలపించారు. ఆస్కార్ వేదికపై హుషారెత్తించే పల్లెపాటతో ఉర్రూతలూగించారు.
