బర్త్ డే కి ముందే ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్స్ ఇచ్చిన రామ్ చరణ్ అభిమానుల్లో జోష్ నింపారు. అయితే ఈ స్పీడు చూసిన జూనియర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త ఫీల్ అవుతున్నారు. చరణ్ ఏకంగా మూడు సినిమాలతో బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ అప్‌కమింగ్ సినిమాల విషయంలో క్లారిటీ మిస్ అవుతుందంటున్నారు అభిమానులు. ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు.