
నివేధా థామస్ .. నని నటించిన జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ

ఆతర్వాత తన అందంతో అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ చిన్నది. ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’, ‘118’, ‘బ్రోచేవారెవరురా’ అనే సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది నివేధా

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో చేసి ఆకట్టుకుంది నివేధా. ‘వకీల్ సాబ్’ చిత్రంలో పల్లవి పాత్రలో నటించిన నివేధాకు మంచి గుర్తింపు లభించింది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంది.

తన సినిమా అప్డేట్స్ తోపాటు..తన అందమైన ఫోటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను అలరిస్తుంది నివేధా.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్ వర్మ డైరెక్షన్‌లో ‘శాకిని ఢాకిని’ అనే మూవీలో నటిస్తుంది. ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.