
మెగాస్టార్ ఫ్యామిలి నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఏకైక హీరోయిన్ నిహారిక. ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిహారిక. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించింది ఈ అమ్మడు.

ఒక మనసు సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ అవికూడా అంతంత మాత్రమే ఆడాయి. ఆతర్వాత నిహారిక సినిమాలకు దూరం అయ్యింది.

ఇక నిహారిక ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు తెరకెక్కిస్తోంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తిరిగి సినిమాల్లో బిజీ కావాలని చూస్తుంది. ఇప్పటికే ఒకటి రెండు సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంది ఈ చిన్నది.

ఇక నిహారిక చైతన్య జొన్నల గడ్డను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి నిహారిక సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు చేస్తూ సందడి చేస్తుంది.

తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పింది. తనకు పిల్లలను కనాలనిపిస్తుందని తెలిపింది. అలాగే రెండో పెళ్లి పై కూడా స్పందించింది. అలాగే రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పకనే చెప్పింది నిహారిక.