
2018లో సవ్యసాచితో ఇండస్ట్రీకి పరిచయమై.. వెంటనే అఖిల్‌తో మిస్టర్ మజ్ను సినిమా చేసారు నిధి అగర్వాల్. ఈ రెండూ ఫ్లాపైనా కూడా ఇస్మార్ట్ శంకర్‌తో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఈ సినిమా తర్వాత వరసగా ఆఫర్స్ వస్తాయనుకున్నా కూడా ఎందుకో బాగా స్లో అయిపోయారు నిధి.

మధ్య హీరో అనే సినిమా చేసినా.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తమళ ఇండస్ట్రీపై ఫోకస్ చేసారు నిధి అగర్వాల్. అక్కడ ఆమెకు గుడి కట్టేంత ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. అయితే కోరుకున్న విజయాలు మాత్రం రాలేదు.

అలాగని తెలుగును పట్టించుకోలేదని కాదు.. ఇక్కడ ఆమె కమిటైన సినిమాలు అలా ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్.. మరోటి ప్రభాస్ సినిమాలు కావడంతో ఆమె చేతుల్లో ఏం లేకుండా పోయింది.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు నిధి. ఈ సినిమాపైనే నిధి అశలన్నీ ఉన్నాయిప్పుడు. ఒక్కటి రెండూ కాదు.. కెరీర్‌లో ప్రైమ్ పీరియడ్ నాలుగేళ్లు రాసిచ్చేసింది ఈ బ్యూటీ. జూలై 24న విడుదల కానుంది వీరమల్లు. ఈ సినిమాతో తను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నమ్మకంగా చెప్తున్నారు నిధి.

హరిహర వీరమల్లుతో పాటు రాజా సాబ్‌లోనూ నటిస్తున్నారు నిధి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకుడు. డిసెంబర్ 5న విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌తో కలిసి నటిస్తున్నారు నిధి. ఈ రెండు సినిమాలతోనే ఈమె టాలీవుడ్ ఫ్యూచర్ డిసైడ్ కానుంది.